విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా
విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా కృతజ్ఞతతో నిను స్తుతించెదను (2)
నా యేసయ్యా నిను వేడుకొనగా నా కార్యములన్నియు సఫలము చేసితివి (2) llవిజయశీలుడాll
1.అలసిన సమయమున – నా ప్రాణములో త్రాణ పుట్టించినావు – (2)
ఆదరణ కలిగించి పిలుపును స్థిరపరచి ధైర్యముతో నింపినావు (2)
నిత్యానందము కలిగించె నీ
శుభ వచనములతో – నెమ్మదినిచ్చితివి (2) llవిజయశీలుడాll
2.ఆశ్చర్యకరముగ – నీ బాహువు చాపి విడుదల కలిగించినావు – (2)
అరణ్య మార్గమున విడువక తోడై విజయముతో నడిపినావు (2)
నీ స్వాస్థ్యమునకు తండ్రిగ నిలిచి
వాగ్ధాన భూమిలో – చేర్చిన దేవా (2) llవిజయశీలుడాll
3.ఆరోగ్యకరమైన నీ – రెక్కల నీడలో ఆశ్రయమిచ్చితివి నాకు – (2)
అక్షయుడా నా సంపూర్ణతకై మహిమాత్మతో నింపినావు (2)
నిత్యము నీతో నేనుండుటకై
నూతన యెరూషలేము నిర్మించుచున్నావు (2) llవిజయశీలుడాll
Vijayasheeludaa naa praana priyudaa
krutajnyatato ninu stutinchedanu (2)
Naa yesayyaa ninu vedukonagaa
naa kaaryamulanniyu saphalamu chesitivi (2) llvijayasheeludaall
1.alasina samayamuna –
naa praanamulo traana puttinchinaavu – (2)
Aadarana kaliginchi pilupunu
sthiraparachi dhairyamuto nimpinaavu (2)
Nityaanandamu kaliginche nee
Shubha vachanamulato – nemmadinichchitivi (2) llvijayasheeludaall
2.aashcharyakaramuga –
nee baahuvu chaapi vidudala kaliginchinaavu – (2)
Aranya maargamuna viduvaka
todai vijayamuto nadipinaavu (2)
Nee svaasthyamunaku tandriga nilichi
Vaagdhaana bhoomilo – cherchina devaa (2) llvijayasheeludaall
3.aarogyakaramaina nee –
rekkala needalo aashrayamichchitivi naaku – (2)
Akshayudaa naa sampoornatakai
mahimaatmato nimpinaavu (2)
Nityamu neeto nenundutakai
Nootana yerooshalemu nirminchuchunnaavu (2) llvijayasheeludaall
Comments
Post a Comment