సమర్పణ చేయుము ప్రభువునకు
సమర్పణ చేయుము ప్రభువునకు
నీ దేహము ధనము సమయమును (2)
1.అబ్రామును అడిగెను ప్రభువప్పుడు
ఇస్సాకును అర్పణ ఇమ్మనెను (2)
నీ బిడ్డను సేవకు నిచ్చెదవా (2)
నీవిచ్చెదవా నీవిచ్చెదవా llసమర్పణll
2.ప్రియము దేవునికి హేబెలు బలి
హేయము కయీనుని అర్పణము
కళంకము కల్ష్మమంటనివి నివిచ్చేదవా llసమర్పణll
3.అయిదు రొట్టెలు చేపలు రెండు
అయిదు వేలకు ఆహారముగా
అర్ఫించెను బాలుడొకటివేళ అట్లిచ్చెదవా llసమర్పణll
4.ప్రభుని ప్రేమించిన పేదరాలు
కాసులు రెండిచ్చెను కానుకగా (2)
జీవనమంతయు దేవునికిచ్చెను (2)
నీవిచ్చెదవా నీవిచ్చెదవా llసమర్పణll
5.నీ దేహము దేవుని ఆలయము
నీ దేవుడు మలిచిన మందిరము (2)
సజీవ యాగముగా నిచ్చెదవా (2)
నీవిచ్చెదవా నీవిచ్చెదవా llసమర్పణll
Samarpana cheyumu prabhuvunaku
Nee dehamu dhanamu samayamunu (2)
1.abraamunu adigenu prabhuvappudu
Issaakunu arpana immanenu (2)
Nee biddanu sevaku nichchedavaa (2)
Neevichchedavaa neevichchedavaa llsamarpanall
2.priyamu devuniki hebelu bali
Heyamu kayeenuni arpanamu
Kalankamu kalshmamantanivi
nivichchedavaa llsamarpanall
3.ayidu rottelu chepalu rendu
Ayidu velaku aahaaramugaa
Arphinchenu baaludokativela
atlichchedavaa llsamarpanall
4.prabhuni preminchina pedaraalu
Kaasulu rendichchenu kaanukagaa (2)
Jeevanamantayu devunikichchenu (2)
Neevichchedavaa neevichchedavaa llsamarpanall
5.nee dehamu devuni aalayamu
Nee devudu malichina mandiramu (2)
Sajeeva yaagamugaa nichchedavaa (2)
Neevichchedavaa neevichchedavaa llsamarpanall
Comments
Post a Comment