వాడబారని విశ్వాసముతో

వాడబారని విశ్వాసముతో శుభప్రదమైన నిరీక్షణతో (2)

వేచియున్నానయ్యా కనిపెట్టుచున్నానయ్యా (2) యేసయ్యా

నీ రాక కోసమై – కడబూర శబ్దముకై

నీ మహిమ కోసమై – నిన్ను చేరుటకై (2)      ||వాడబారని||


1.మోకాళ్లపై వేచితి – కన్నీళ్ల పర్యంతమై
బీడు బారిన నేల వానకై – ఎదురు చూచినా సంఘమై (2)
సిద్ధపడియున్న వధువునై
ఆశతో వేచానయ్యా (2) యేసయ్యా       ||నీ రాక||

2.లేఖనములను చూచితి – గురుతులు గమనించితి
ప్రవచన నెరవేర్పులన్ని – జరుగుట గుర్తించితి (2)
రారాజువై నీవు రావాలని
ఎదురు చూచుచున్నానయ్యా (2) యేసయ్యా     ||నీ రాక||

3.నీటి కొరకై వేచిన – గూడ బాతును పోలిన
ఆత్మ దాహము తోడనిండి – అల్లాడుచున్నానయ్యా (2)
లోక బంధాల నుండి
నీ చెలిమి కోరానయ్యా (2) యేసయ్యా       ||నీ రాక|| Vaadabaarani vishvaasamuto shubhapradamaina nireekshanato (2) Vechiyunnaanayyaa kanipettuchunnaanayyaa (2) yesayyaa Nee raaka kosamai – kadaboora shabdamukai Nee mahima kosamai – ninnu cherutakai (2) ||vaadabaarani|| 1.mokaallapai vechiti – kanneella paryantamai Beedu baarina nela vaanakai – eduru choochinaa sanghamai (2) Siddhapadiyunna vadhuvunai Aashato vechaanayyaa (2) yesayyaa ||nee raaka|| 2.lekhanamulanu choochiti – gurutulu gamaninchiti Pravachana neraverpulanni – jaruguta gurtinchiti (2) Raaraajuvai neevu raavaalani Eduru choochuchunnaanayyaa (2) yesayyaa ||nee raaka|| 3.neeti korakai vechina – gooda baatunu polina Aatma daahamu todanindi – allaaduchunnaanayyaa (2) Loka bandhaala nundi Nee chelimi koraanayyaa (2) yesayyaa ||nee raaka||


Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు