స్తుతి గానమే పాడనా
స్తుతి గానమే పాడనా - జయగీతమే పాడనా (2)
నా ఆధారమైయున్న - యేసయ్యా నీకు – కృతజ్ఞుడనై
జీవితమంతయు సాక్షినై యుందును (2) ||స్తుతి||
1.నమ్మదగినవి నీ న్యాయ విధులు
మేలిమి బంగారు కంటే – ఎంతో కోరతగినవి (2)
నీ ధర్మాసనము – నా హృదయములో
స్థాపించబడియున్నది – పరిశుద్ధాత్మునిచే (2) ||స్తుతి||
2.శ్రేష్టమైనవి నీవిచ్చు వరములు
లౌకిక జ్ఞానము కంటే – ఎంతో ఉపయుక్తమైనవి (2)
నీ శ్రేష్టమైన – పరిచర్యలకై
కృపావరములతో నను – అలంకరించితివే (2) ||స్తుతి||
3.నూతనమైనది నీ జీవ మార్గము
విశాల మార్గము కంటే – ఎంతో ఆశించదగినది (2)
నీ సింహాసనము – నను చేర్చుటకై
నాతో నీవుంటివే – నా గురి నీవైతివే (2) ||స్తుతి||
Stuti gaaname paadanaa - jayageetame paadanaa (2)
Naa aadhaaramaiyunna - yesayyaa neeku – krutajnyudanai
Jeevitamantayu saakshinai yundunu (2) ||stuti||
1.nammadaginavi nee nyaaya vidhulu
Melimi bangaaru kante – ento korataginavi (2)
Nee dharmaasanamu – naa hrudayamulo
Sthaapinchabadiyunnadi – parishuddhaatmuniche (2) ||stuti||
2.shreshtamainavi neevichchu varamulu
Laukika jnyaanamu kante – ento upayuktamainavi (2)
Nee shreshtamaina – paricharyalakai
Krupaavaramulato nanu – alankarinchitive (2) ||stuti||
3.nootanamainadi nee jeeva maargamu
Vishaala maargamu kante – ento aashinchadaginadi (2)
Nee sinhaasanamu – nanu cherchutakai
Naato neevuntive – naa guri neevaitive (2) ||stuti||
Comments
Post a Comment