వందనంబొనర్తుమో ప్రభో ప్రభో
వందనం బొనర్తుమో ప్రభో ప్రభో వందనంబొనర్తుమో ప్రభో ప్రభో
వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా వందనంబు లందుకో ప్రభో llవందనంll
1.ఇన్ని నాళ్ళు ధరను మమ్ము బ్రోచియు గన్న తండ్రి మించి ఎపుడు గాచియు
ఎన్నలేని దీవెన లిడు నన్న యేసువా యన్ని రెట్లు స్తోత్రములివిగో ||వందనం||
2.ప్రాత వత్సరంపు బాప మంతయు బ్రీతిని మన్నించి మమ్ము గావుము
నూత నాబ్దమునను నీదు నీతి నొసగుమా దాత క్రీస్తు నాథ రక్షకా llవందనంll
3.దేవ మాదు కాలుసేతు లెల్లను సేవకాలి తనువు దినములన్నియు
నీ వొసంగు వెండి పసిడి జ్ఞానమంత నీ సేవకై యంగీకరించుమా llవందనంll
4.కోతకొరకు దాసజనము నంపుము ఈ తరి మా లోటుపాట్లు దీర్చుము
పాతకంబు లెల్ల మాపి భీతి బాపుము ఖ్యాతి నొందు నీతి సూర్యుడా llవందనంll
5.మా సభలను పెద్దజేసి పెంచుము నీ సువార్త జెప్ప శక్తి నీయుము
మోసపుచ్చు నందకార మంత ద్రోయుము యేసు కృపన్ గుమ్మరించుము llవందనంll
Vandanambonartumo prabho prabho
vandanambonartumo prabho prabho
Vandanambu tandri tanaya shuddhaatmudaa
vandanambu landuko prabho llvandananll
1.inni naallu dharanu mammu brochiyu ganna
tandri minchi epudu gaachiyu
Ennaleni deevena lidu nanna yesuvaa
yanni retlu stotramulivigo ||vandanan||
2.praata vatsarampu baapa mantayu
breetini manninchi mammu gaavumu
Noota naabdamunanu needu neeti nosagumaa
daata kreestu naatha rakshakaa llvandananll
3.deva maadu kaalusetu lellanu
sevakaali tanuvu dinamulanniyu
Nee vosangu vendi pasidi jnyaanamanta
nee sevakai yangeekarinchumaa llvandananll
4.kotakoraku daasajanamu nampumu
ee tari maa lotupaatlu deerchumu
Paatakambu lella maapi bheeti baapumu
khyaati nondu neeti sooryudaa llvandananll
5.maa sabhalanu peddajesi penchumu
nee suvaarta jeppa shakti neeyumu
Mosapuchchu nandakaara manta droyumu
yesu krupan gummarinchumu llvandananll
Comments
Post a Comment