శరణం శరణం శరణం దేవా – కరుణ నాథుడా

శరణం శరణం శరణం దేవా – కరుణ నాథుడా (2)

కరుణ నాథుడా – ఈ తరుణమే ప్రభో (2)     ||శరణం||

1.పాపరహిత దేవకుమారా – శాపవాహకా (2)
శాపవాహకా – నిత్య కోప రహితుడా (2)      ||శరణం||

2.పరిపూర్ణ దేవుడా – నరావతారుడా (2)
నరావతారుడా – మా యేసు నాథుడా (2)     ||శరణం||

3.దయామయుండ క్రీస్తు యేసు – దాక్షిణ్య ప్రభువా (2)
దాక్షిణ్య ప్రభువా – బాహుళ్య దేవుడా (2)     ||శరణం||

4.నమ్మదగిన లోకరక్షకా – సర్వోపకారుడా (2)
సర్వోపకారుడా – సర్వశక్తిమంతుడా (2)      ||శరణం||

5.సాత్వికుండా – సర్వజనుల కాంక్షణీయుడా (2)
కాంక్షణీయుడా – వాత్సల్య దేవుడా (2)       ||శరణం||

6.రిక్తుడై తగ్గించుకొనిన – వినయపూర్ణుడా (2)
వినయపూర్ణుడా – మముగాచు దేవుడా (2)    ||శరణం||

7.సత్యవంతుడవు – మాదు నిత్యదేవుడా (2)
నిత్యదేవుడా – మా మంచి బోధకుడా (2)     ||శరణం||

8.సర్వలోక సృష్టికర్త – సత్యదేవుడా (2)
సత్యదేవుడా – మా నిత్యజీవమా (2)          ||శరణం||

9.ఎల్లరిలో శ్రేష్ఠుడా – మా వల్లభుండవు (2)
వల్లభుండవు హల్లెలూయ పాడెదం (2)        ||శరణం|| Sharanam sharanam sharanam devaa – karuna naathudaa (2) Karuna naathudaa – ee taruname prabho (2) ||sharanan|| 1.paaparahita devakumaaraa – shaapavaahakaa (2) Shaapavaahakaa – nitya kopa rahitudaa (2) ||sharanan|| 2.paripoorna devudaa – naraavataarudaa (2) Naraavataarudaa – maa yesu naathudaa (2) ||sharanan|| 3.dayaamayunda kreestu yesu – daakshinya prabhuvaa (2) Daakshinya prabhuvaa – baahulya devudaa (2) ||sharanan|| 4.nammadagina lokarakshakaa – sarvopakaarudaa (2) Sarvopakaarudaa – sarvashaktimantudaa (2) ||sharanan|| 5.saatvikundaa – sarvajanula kaankshaneeyudaa (2) Kaankshaneeyudaa – vaatsalya devudaa (2) ||sharanan|| 6.riktudai tagginchukonina – vinayapoornudaa (2) Vinayapoornudaa – mamugaachu devudaa (2) ||sharanan|| 7.satyavantudavu – maadu nityadevudaa (2) Nityadevudaa – maa manchi bodhakudaa (2) ||sharanan|| 8.sarvaloka srushtikarta – satyadevudaa (2) Satyadevudaa – maa nityajeevamaa (2) ||sharanan|| 9.ellarilo shreshthudaa – maa vallabhundavu (2) Vallabhundavu hallelooya paadedam (2) ||sharanan||


Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు