సర్వ చిత్తంబు నీదేనయ్యా
1.సర్వ చిత్తంబు నీదేనయ్యా - స్వరూపమిచ్చు కుమ్మరివే (2)
సారెపైనున్న మంటినయ్యా - సరియైన పాత్రన్ చేయుమయ్యా
సర్వేశ్వరా నే రిక్తుండను సర్వదా నిన్నే సేవింతును ||సర్వ చిత్తంబు||
2.ప్రభూ! సిద్ధించు నీ చిత్తమే - ప్రార్ధించుచుంటి నీ సన్నిధి (2)
పరికింపు నన్నీ దివసంబున - పరిశుభ్రమైన హిమము కన్నా
పరిశుద్ధున్ జేసి పాలింపుమా పాపంబు పోవ నను కడుగుమా ||సర్వ చిత్తంబు||
3.నీ చిత్తమే సిద్ధించు ప్రభూ - నిన్నే ప్రార్ధింతు నా రక్షకా (2)
నీఛమౌ గాయముల చేతను - నిత్యంబు కృంగి అలసియుండ
నిజమైన సర్వ శక్తుండవే- నీ చేత పట్టి నన్ రక్షింపుమా ||సర్వ చిత్తంబు||
4.ఆత్మ స్వరూప నీ చిత్తమే - అనిశంబు చెల్లు ఇహ పరమున (2)
అధికంబుగా నన్ నీ ఆత్మతో - ఆవరింపుమో నా రక్షకా
అందరు నాలో క్రీస్తుని జూడ - ఆత్మతో నన్ను నింపుము దేవా ||సర్వ చిత్తంబు||
1.sarva chittambu needenayyaa - svaroopamichchu kummarive (2)
Saarepainunna mantinayyaa - sariyaina paatran cheyumayyaa
Sarveshvaraa ne riktundanu sarvadaa ninne sevintunu ||sarva chittambu||
2.prabhoo! siddhinchu nee chittame - praardhinchuchunti nee sannidhi (2)
Parikimpu nannee divasambuna - parishubhramaina himamu kannaa
Parishuddhun jesi paalimpumaa
paapambu pova nanu kadugumaa ||sarva chittambu||
3.nee chittame siddhinchu prabhoo - ninne praardhintu naa rakshakaa (2) Neechhamau gaayamula chetanu - nityambu krungi alasiyunda Nijamaina sarva shaktundave- nee cheta patti nan rakshimpumaa ||sarva chittambu|| 4.aatma svaroopa nee chittame - anishambu chellu iha paramuna (2) Adhikambugaa nan nee aatmato - aavarimpumo naa rakshakaa Andaru naalo kreestuni jooda - aatmato nannu nimpumu devaa ||sarva chittambu||
Comments
Post a Comment