శ్రీ యేసుండు జన్మించె రేయిలో
1.శ్రీ యేసుండు జన్మించె రేయిలో (2)
నేడు పాయక బెత్లెహేము ఊరిలో (2) ||శ్రీ యేసుండు||
2.ఆ కన్నియ మరియమ్మ గర్భమందున (2)
ఇమ్మానుయేలనెడి నామమందున (2) ||శ్రీ యేసుండు||
3.సత్రమందున పశువులశాల యందున (2)
దేవపుత్రుండు మనుజుండాయెనందునా (2) ||శ్రీ యేసుండు||
4.పట్టి పొత్తి గుడ్డలతో చుట్టబడి (2)
పశుల తొట్టిలో పరుండ బెట్టబడి (2) ||శ్రీ యేసుండు||
5.గొల్లలెల్లరు మిగుల భీతిల్లగా (2)
దెల్పె గొప్ప వార్త దూత చల్లగా (2) ||శ్రీ యేసుండు||
6.మన కొరకొక్క శిశువు పుట్టెను (2)
ధరను మన దోషములబోగొట్టెను (2) ||శ్రీ యేసుండు||
7.పరలోకపు సైన్యంబు గూడెను (2)
మింట వర రక్షకుని గూర్చి పాడెను (2) ||శ్రీ యేసుండు||
8.అక్షయుండగు యేసు పుట్టెను (2)
మనకు రక్షణంబు సిద్ధపరచెను (2) ||శ్రీ యేసుండు||
1.shree yesundu janminche reyilo (2)
Nedu paayaka betlehemu oorilo (2) ||shree yesundu||
2.aa kanniya mariyamma garbhamanduna (2)
Immaanuyelanedi naamamanduna (2) ||shree yesundu||
3.satramanduna pashuvulashaala yanduna (2)
Devaputrundu manujundaayenandunaa (2) ||shree yesundu||
4.patti potti guddalato chuttabadi (2)
Pashula tottilo parunda bettabadi (2) ||shree yesundu||
5.gollalellaru migula bheetillagaa (2)
Delpe goppa vaarta doota challagaa (2) ||shree yesundu||
6.mana korakokka shishuvu puttenu (2)
Dharanu mana doshamulabogottenu (2) ||shree yesundu||
7.paralokapu sainyambu goodenu (2)
Minta vara rakshakuni goorchi paadenu (2) ||shree yesundu||
8.akshayundagu yesu puttenu (2)
Manaku rakshanambu siddhaparachenu (2) ||shree yesundu||
Comments
Post a Comment