స్తుతి ప్రశంస పాడుచు కీర్తింతు నిత్యము

స్తుతి ప్రశంస పాడుచు కీర్తింతు నిత్యము (2)
మహా రక్షణ నిచ్చియు మనశ్శాంతి నిచ్చెను (2)

1.పాపలోక బంధమందు దాసత్వమందుండ (2)
నీ రక్తశక్తిచే ప్రభు విమోచించితివి (2)               ||స్తుతి ప్రశంస||

2.పాప భారముచే నేను దుఃఖము పొందితి (2)
నా ప్రభువే భరించెను నా దుఃఖ బాధలు (2)      ||స్తుతి ప్రశంస||

3.హృదయాంధకారముచే నేను దారి తొలగితి (2)
ప్రభువే జ్యోతి యాయెను సత్యమార్గము చూపె (2)    ||స్తుతి ప్రశంస||

4.పెంటకుప్పనుండి నన్ను లేవనెత్తితివి (2)
దరిద్రుడనైన నన్ను రాజుగా జేసితివి (2)        ||స్తుతి ప్రశంస|| Stuti prashansa paaduchu keertintu nityamu (2) Mahaa rakshana nichchiyu manashshaanti nichchenu (2) 1.paapaloka bandhamandu daasatvamandunda (2) Nee raktashaktiche prabhu vimochinchitivi (2) ||stuti prashansa|| 2.paapa bhaaramuche nenu duhkhamu ponditi (2) Naa prabhuve bharinchenu naa duhkha baadhalu (2) ||stuti prashansa|| 3.hrudayaandhakaaramuche nenu daari tolagiti (2) Prabhuve jyoti yaayenu satyamaargamu choope (2) ||stuti prashansa|| 4.pentakuppanundi nannu levanettitivi (2) Daridrudanaina nannu raajugaa jesitivi (2) ||stuti prashansa||

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు