సరి రారెవ్వరు – నా ప్రియుడైన యేసయ్యకు

  సరి రారెవ్వరు – నా ప్రియుడైన యేసయ్యకు (2)

  సర్వము నెరిగిన సర్వేశ్వరునికి - సరిహద్దులు లేని పరిశుద్ధునికి (2) ||సరి||


1.నమ్మదగిన వాడే నలు దిశల – నెమ్మది కలుగ చేయువాడే (2)
  నాజీరు వ్రతము జీవితమంతా అనుసరించినాడే (2)
  నాకై నిలువెల్ల సిలువలో నలిగి కరిగినాడే (2)       ||సరి||

2.ఆరోగ్య ప్రదాతయే సంపూర్ణ స్వస్థత అనుగ్రహించువాడే (2)
  ఆశ్చర్య క్రియలు జీవితమంతా చేయుచు తిరిగినాడే (2)
  నాకై కొరడాల దెబ్బలను అనుభవించినాడే (2)       ||సరి||

3.పునరుత్థానుడే జయశీలి మృతిని గెలిచి లేచినాడే (2)
  శ్రేష్టమైన పునరుత్థాన బలము ఇచ్చినాడే (2)
  నాకై అతి త్వరలో మహిమతో రానైయున్నవాడే (2) ||సరి|| sari raarevvaru – naa priyudaina yesayyaku (2) sarvamu nerigina sarveshvaruniki sarihaddulu leni parishuddhuniki (2) ||sari|| 1.nammadagina vaade nalu dishala – nemmadi kaluga cheyuvaade (2) naajeeru vratamu jeevitamantaa anusarinchinaade (2) naakai niluvella siluvalo naligi kariginaade (2) ||sari|| 2.aarogya pradaataye sampoorna svasthata anugrahinchuvaade (2) aashcharya kriyalu jeevitamantaa cheyuchu tiriginaade (2) naakai koradaala debbalanu anubhavinchinaade (2) ||sari|| 3.punarutthaanude jayasheeli mrutini gelichi lechinaade (2) shreshtamaina punarutthaana balamu ichchinaade (2) naakai ati tvaralo mahimato raanaiyunnavaade (2) ||sari||


Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు