సమయమిదే సమయమిదే

 సమయమిదే - సమయమిదే - సంఘమ సమయమిదే
    సీయోనులో చేరుటకు - సంఘమా సమయమిదే            ॥సమ॥

 1 చూడుము భూమిమీద - పాప చీకటి కమ్మియున్నది
  జ్యోతివలె జీవించుము - జీవవాక్యము పట్టుకొని       ॥సమ॥

2. ధూళి దులుపుకొనుము నీవు మెడకట్లు విప్పుకొనుము
  సుందరమైన వస్త్రము - వేగము ధరించి సిద్ధపడుము    ॥సమ॥

3. నిలువుము సత్యముకై - సువార్తకై పోరాడుము
    సేవను చేసి నీవు - త్యాగముచేయుము ప్రాణమును   ॥సమ॥

4. సీయోను శత్రువులు - సిగ్గుపడుదురు నిశ్చయముగా
    సీయోను నీ పరుగు - తుదముట్టించుము త్వరితముగా    ॥సమ॥

5. సీయోనులో వసియించు - సర్వశక్తుడు నీ ద్వారా శోధింప
    ఈ దినము మార్పునొందుము స్పటికముగా ॥సమ॥

6. పిలుపుకు తగినట్లుగా -  నీవు నడువుము ప్రభుయేసుతో
    ప్రేమలోనే నిలువుము - నిత్యజీవము చేపట్టుము     ॥సమ॥

7. సీయోను రారాజు నిన్ను చూచి ఏతెంచును
    మహిమగల కిరీటము - నీకు ఆయన ఇచ్చును     ॥సమ॥

samayamide - samayamide - sanghama samayamide seeyonulo cherutaku - sanghamaa samayamide ॥sama॥ 1 choodumu bhoomimeeda - paapa cheekati kammiyunnadi jyotivale jeevinchumu - jeevavaakyamu pattukoni ॥sama॥ 2. dhooli dulupukonumu neevu medakatlu vippukonumu sundaramaina vastramu - vegamu dharinchi siddhapadumu ॥sama॥ 3. niluvumu satyamukai - suvaartakai poraadumu sevanu chesi neevu - tyaagamucheyumu praanamunu ॥sama॥ 4. seeyonu shatruvulu - siggupaduduru nishchayamugaa seeyonu nee parugu - tudamuttinchumu tvaritamugaa ॥sama॥ 5. seeyonulo vasiyinchu - sarvashaktudu nee dvaaraa shodhimpa ee dinamu maarpunondumu spatikamugaa ॥sama॥ 6. pilupuku taginatlugaa - neevu naduvumu prabhuyesuto premalone niluvumu - nityajeevamu chepattumu ॥sama॥ 7. seeyonu raaraaju ninnu choochi etenchunu mahimagala kireetamu - neeku aayana ichchunu ॥sama॥


Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు