స్తుతి పాడుటకే బ్రతికించిన – జీవనదాతవు నీవేనయ్యా

స్తుతి పాడుటకే బ్రతికించిన – జీవనదాతవు నీవేనయ్యా

ఇన్నాళ్లుగా నను పోషించిన – తల్లివలె నను ఓదార్చిన

నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా (2)

జీవితకాలమంతా ఆధారం నీవేనయ్యా

నా జీవితకాలమంతా ఆరాధించి ఘనపరతును      ||స్తుతి పాడుటకే||


1.ప్రాణభయమును తొలగించినావు – ప్రాకారములను స్థాపించినావు
సర్వజనులలో నీ మహిమ వివరింప దీర్ఘాయువుతో నను నింపినావు (2)
నీ కృపా బాహుళ్యమే వీడని అనుబంధమై
తలచిన ప్రతిక్షణమున నూతన బలమిచ్చెను        ||స్తుతి పాడుటకే||

2.నాపై ఉదయించె నీ మహిమ కిరణాలు – కనుమరుగాయెను నా దుఖ:దినములు
కృపలనుపొంది నీ కాడి మోయుటకు లోకములోనుండి ఏర్పరచినావు (2)
నీ దివ్య సంకల్పమే- అవనిలో శుభప్రదమై
నీ నిత్య రాజ్యమునకై నిరీక్షణ కలిగించెను           ||స్తుతి పాడుటకే||

3.హేతువులేకయే ప్రేమించినావు – వేడుకగా ఇల నను మార్చినావు
కలవరమొందిన వేళలయందు నా చేయి విడువక నడిపించినావు (2)
నీ ప్రేమ మాధుర్యమే నా నోట స్తుతిగానమై
నిలిచిన ప్రతి స్థలమున పారెను సెలయేరులై        ||స్తుతి పాడుటకే|| Stuti paadutake bratikinchina – jeevanadaatavu neevenayyaa Innaallugaa nanu poshinchina – tallivale nanu odaarchina Nee prema naapai ennadu maaradu yesayyaa (2) Jeevitakaalamantaa aadhaaram neevenayyaa Naa jeevitakaalamantaa aaraadhinchi ghanaparatunu ||stuti paadutake|| 1.praanabhayamunu tolaginchinaavu – praakaaramulanu sthaapinchinaavu Sarvajanulalo nee mahima vivarimpa deerghaayuvuto nanu nimpinaavu (2) Nee krupaa baahulyame veedani anubandhamai Talachina pratikshanamuna nootana balamichchenu ||stuti paadutake|| 2.naapai udayinche nee mahima kiranaalu – kanumarugaayenu naa dukha:dinamulu Krupalanupondi nee kaadi moyutaku lokamulonundi erparachinaavu (2) Nee divya sankalpame- avanilo shubhapradamai Nee nitya raajyamunakai nireekshana kaliginchenu ||stuti paadutake|| 3.hetuvulekaye preminchinaavu – vedukagaa ila nanu maarchinaavu Kalavaramondina velalayandu naa cheyi viduvaka nadipinchinaavu (2) Nee prema maadhuryame naa nota stutigaanamai Nilichina prati sthalamuna paarenu selayerulai ||stuti paadutake||

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు