స్తోత్రింతుము నిను మాదు తండ్రి
స్తోత్రింతుము నిను మాదు తండ్రి - సత్యముతో ఆత్మతో నెప్పుడు (2)
పరిశుధ్ధాలంకారములతో - దర్శించెదము శరణం శరణం (2) llస్తోత్రింతుముll
1.శ్రేష్ఠ యీవుల యూట నీవే - శ్రేష్ఠ కుమారుని ఇచ్చినందున (2)
త్రిత్వమై ఏకత్వమైన త్రి - లోకనాథ శరణం శరణం (2) llస్తోత్రింతుముll
2. పాపిమిత్రుడ పాపనాశక - పరమవాసా ప్రేమపూర్ణా
వ్యోమపీఠుడా స్వర్ణమయుడా - పరిశుద్ధాంగుడా శరణం శరణం llస్తోత్రింతుముll
3. ధవళవర్ణుడ రత్నవర్ణుడ - సత్యరూపి యనబడువాడా
నను రక్షించిన రక్షకుండా - నాధా నీకే శరణం శరణం llస్తోత్రింతుముll
4. బంగరు వెంట్రుకలు తలపై - ఉంగరములుగ కనబడుచున్నవి
పదివేలలో నతి కాంక్షనీయుడా – వేలకొలది శరణం శరణం llస్తోత్రింతుముll
5. గువ్వలవంటి కన్నులు - పువ్వులవంటి చెక్కిళ్ళు
మంచిరూపము కల్గినందున - మాకు నీవే శరణం శరణం llస్తోత్రింతుముll
6. చేతులు బంగారుమయము - చెక్కిన రత్నముల వంటివి
కాళ్ళు రాతి స్తంభములవలె - కన్పడుచున్నందున శరణం llస్తోత్రింతుముll
7. సంఘములకు శిరస్సు నీవే - రాజ నీకే నమస్కారములు
ముఖ్యమైన మూలరాయి - కోట్లకొలది శరణం శరణం llస్తోత్రింతుముll
8. నీదు సేవకుల పునాది - జ్ఞానమునకు మించిన తెలివి
అందముగను కూడుకొనుచు - వేడుకొందుము శరణం శరణం llస్తోత్రింతుముll
9. రాజ నీకే స్తుతి స్తోత్రములు - గీతములు మంగళధ్వనులు
శుభము శుభము శుభము నిత్యము - హల్లెలూయ ఆమెన్ ఆమెన్ llస్తోత్రింతుముll
Stotrintumu ninu maadu tandri - satyamuto aatmato neppudu (2)
Parishudhdhaalankaaramulato - darshinchedamu sharanam sharanam (2) llstotrintumull
1.shreshtha yeevula yoota neeve - shreshtha kumaaruni ichchinanduna (2)
Tritvamai ekatvamaina tri - lokanaatha sharanam sharanam (2) llstotrintumull
2. paapimitruda paapanaashaka - paramavaasaa premapoornaa
Vyomapeethudaa svarnamayudaa - parishuddhaangudaa sharanam sharanam llstotrintumull
3. dhavalavarnuda ratnavarnuda - satyaroopi yanabaduvaadaa
Nanu rakshinchina rakshakundaa - naadhaa neeke sharanam sharanam llstotrintumull
4. bangaru ventrukalu talapai - ungaramuluga kanabaduchunnavi
Padivelalo nati kaankshaneeyudaa – velakoladi sharanam sharanam llstotrintumull
5. guvvalavanti kannulu - puvvulavanti chekkillu
Manchiroopamu kalginanduna - maaku neeve sharanam sharanam llstotrintumull
6. chetulu bangaarumayamu - chekkina ratnamula vantivi
Kaallu raati stambhamulavale - kanpaduchunnanduna sharanam llstotrintumull
7. sanghamulaku shirassu neeve - raaja neeke namaskaaramulu
Mukhyamaina moolaraayi - kotlakoladi sharanam sharanam llstotrintumull
8. needu sevakula punaadi - jnyaanamunaku minchina telivi
Andamuganu koodukonuchu - vedukondumu sharanam sharanam llstotrintumull
9. raaja neeke stuti stotramulu - geetamulu mangaladhvanulu
Shubhamu shubhamu shubhamu nityamu - hallelooya aamen aamen llstotrintumull
Comments
Post a Comment