రాజాధి రాజా రారా – రాజులకు రాజువై రారా
రాజాధి రాజా రారా – రాజులకు రాజువై రారా
రాజయేసు రాజ్యమేల రారా – రవికోటి తేజ యేసు రారా (2)
ఓ… మేఘ వాహనంబు మీద వేగమే
ఓ… మించు వైభవంబు తోడ వేగమే ||రాజాధి||
1.ఓ… భూజనంబులెల్ల తేరిచూడగా
ఓ… నీ జనంబు స్వాగతంబునీయగా
నీ రాజ్యస్థాపనంబు సేయ – భూరాజులెల్ల గూలిపోవ
భూమి ఆకసంబు మారిపోవ – నీ మహా ప్రభావమున వేగ ||రాజాధి||
2.ఆ… ఆకసమున దూత లార్భటింపగా
ఆ… ఆదిభక్త సంఘ సమేతంబుగా
ఆకసంబు మధ్య వీధిలోన – ఏకమై మహాసభ జేయ
యేసు నాధ! నీదు మహిమలోన – మాకదే మహానందమౌగ ||రాజాధి||
3.ఓ… పరమ యెరుషలేము పుణ్య సంఘమా
ఓ… గొఱియపిల్ల క్రీస్తు పుణ్య సంఘమా
పరమ దూతలార! భక్తులారా! – పౌలపోస్తులారా! పెద్దలారా!
గొఱియపిల్ల యేసురాజు పేర – క్రొత్త గీతమెత్తి పాడరారా ||రాజాధి||
Raajaadhi raajaa raaraa – raajulaku raajuvai raaraa
Raajayesu raajyamela raaraa – ravikoti teja yesu raaraa (2)
O… megha vaahanambu meeda vegame
O… minchu vaibhavambu toda vegame ||raajaadhi||
1.o… bhoojanambulella terichoodagaa
O… nee janambu svaagatambuneeyagaa
Nee raajyasthaapanambu seya – bhooraajulella goolipova
Bhoomi aakasambu maaripova – nee mahaa prabhaavamuna vega ||raajaadhi||
2.aa… aakasamuna doota laarbhatimpagaa
Aa… aadibhakta sangha sametambugaa
Aakasambu madhya veedhilona – ekamai mahaasabha jeya
Yesu naadha! needu mahimalona – maakade mahaanandamauga ||raajaadhi||
3.o… parama yerushalemu punya sanghamaa
O… goriyapilla kreestu punya sanghamaa
Parama dootalaara! bhaktulaaraa! – paulapostulaaraa! peddalaaraa!
Goriyapilla yesuraaju pera – krotta geetametti paadaraaraa ||raajaadhi||
Comments
Post a Comment