పరమ జీవము నాకు నివ్వ

పరమ జీవము నాకు నివ్వ - తిరిగి లేచెను నాతో నుండ
నిరంతరము నన్ను నడిపించును - మరల వచ్చి యేసు కొని పోవును

యేసు చాలును – యేసు చాలును - యే సమయమైన
యే స్థితికైన - నా జీవితములో యేసు చాలును

1.సాతాను శోధనలధికమైన - సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను
లోకము శరీరము లాగినను - లోబడక నేను వెళ్ళెదను   ||యేసు||

2.పచ్చిక బయలులో పరుండజేయున్ - శాంతి జలము చెంత నడిపించును
అనిశము ప్రాణము - తృప్తిపరచున్ మరణ లోయలో నన్ను కాపాడును ||యేసు||

3.నరులెల్లరు నన్ను విడిచినను  - శరీరము కుళ్ళి కృశించినను
హరించినన్ నా ఐశ్వర్యము - విరోధివలె నన్ను విడచినను   ||యేసు|| Parama jeevamu naaku nivva - tirigi lechenu naato nunda Nirantaramu nannu nadipinchunu - marala vachchi yesu koni povunu Yesu chaalunu – yesu chaalunu - ye samayamaina Ye sthitikaina - naa jeevitamulo yesu chaalunu 1.saataanu shodhanaladhikamaina - sommasillaka saagi velledanu Lokamu shareeramu laaginanu - lobadaka nenu velledanu ||yesu|| 2.pachchika bayalulo parundajeyun - shaanti jalamu chenta nadipinchunu Anishamu praanamu - truptiparachun marana loyalo nannu kaapaadunu ||yesu|| 3.narulellaru nannu vidichinanu - shareeramu kulli krushinchinanu Harinchinan naa aishvaryamu - virodhivale nannu vidachinanu ||yesu||

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు