రండి సువార్త సునాదముతో

రండి సువార్త సునాదముతో రంజిలు సిలువ నినాదముతో

తంబుర సితార నాదముతో ప్రభు యేసు దయానిధి సన్నిధికి (2)   llరండిll


1.యేసే మానవ జాతి వికాసం - యేసే మానవ నీతి విలాసం
యేసే పతీత పావన నామం - భాసుర క్రైస్తవ శుభ నామం     llరండిll

2.యేసే దేవుని ప్రేమ స్వరూపం - యేసే సర్వేశ్వర ప్రతిరూపం
యేసే ప్రజాపతి పరమేశం - ఆశ్రిత జనముల సుఖవాసం     llరండిll

3.యేసే సిలువను మోసిన దైవం - యేసే ఆత్మల శాశ్వత జీవం
యేసే క్షమాపణ అధికారం - దాసుల ప్రార్ధన సహకారం        llరండిll

4.యేసే సంఘములో మన కాంతి - యేసే హృదయములో ఘన శాంతి
యేసే కుటుంబ జీవన జ్యోతి - పసిపాపల దీవెన మూర్తి        llరండిll

5.యేసే జీవన ముక్తికి మార్గం - యేసే భక్తుల భూతల స్వర్గం
యేసే ప్రపంచ శాంతికి సూత్రం - వాసిగ నమ్మిన జన స్తోత్రం   llరండిll Randi suvaarta sunaadamuto ranjilu siluva ninaadamuto Tambura sitaara naadamuto prabhu yesu dayaanidhi sannidhiki (2) llrandill 1.yese maanava jaati vikaasam - yese maanava neeti vilaasam Yese pateeta paavana naamam - bhaasura kraistava shubha naamam llrandill 2.yese devuni prema svaroopam - yese sarveshvara pratiroopam Yese prajaapati paramesham - aashrita janamula sukhavaasam llrandill 3.yese siluvanu mosina daivam - yese aatmala shaashvata jeevam Yese kshamaapana adhikaaram - daasula praardhana sahakaaram llrandill 4.yese sanghamulo mana kaanti - yese hrudayamulo ghana shaanti Yese kutumba jeevana jyoti - pasipaapala deevena moorti llrandill 5.yese jeevana muktiki maargam - yese bhaktula bhootala svargam Yese prapancha shaantiki sootram - vaasiga nammina jana stotram llrandill


Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు