రాకడ సమయంలో – కడబూర శబ్ధంతో

రాకడ సమయంలో – కడబూర శబ్ధంతో

యేసుని చేరుకునే – విశ్వాసం నీకుందా? (2)

రావయ్య యేసయ్య – వేగరావయ్యా

రావయ్య యేసునాథా – వేగమెరావయ్యా (2)  ||రాకడ||


యేసయ్య రాకడ సమయంలో
ఎదురేగె రక్షణ నీకుందా? (2)
లోకాశలపై విజయం నీకుందా? (2)   ||రావయ్య||

ఇంపైన ధూపవేదికగా
ఏకాంత ప్రార్థన నీకుందా? (2)
యేసు ఆశించే దీన మనస్సుందా? (2)  ||రావయ్య||

దినమంతా దేవుని సన్నధిలో
వాక్యం కొరకు ఆకలి నీకుందా? (2)
యేసునాథునితో సహవాసం నీకుందా? (2)  ||రావయ్య||

శ్రమలోన సహనం నీకుందా?
స్తుతియించే నాలుక నీకుందా? (2)
ఆత్మలకొరకైన భారం నీకుందా? (2)   ||రావయ్య||

నీ పాత రోత జీవితము
నీ పాప హృదయం మారిందా? (2)
నూతన హృదయంతో ఆరాధన నీకుందా? (2)    ||రావయ్య||

అన్నీటికన్నా మిన్నగను
కన్నీటి ప్రార్థన నీకుందా? (2)
ఎల్లవేళలలో స్తుతియాగం నీకుందా? (2)   ||రావయ్య||


Comments

Popular posts from this blog

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు

నీ చేతితో నన్ను పట్టుకో