పువ్వులాంటిది జీవితం రాలిపోతుంది

పువ్వులాంటిది జీవితం రాలిపోతుంది గడ్డిలాంటిది జీవితం వాడిపోతుంది (2)
ఏ దినమందైనా ఏ క్షణమైనా (2)
రాలిపోతుంది నేస్తమా  ఆ.. వాడిపోతుంది నేస్తమా (2)

1.పాల రాతపైన నడిచినా గాని - పట్టు వస్త్రాలే నీవు తొడిగినా గాని (2)
అందలము పైన కూర్చున్నా గాని - అందనంత స్థితిలో నీవున్నా గాని
కన్ను మూయడం ఖాయం - నిన్ను మోయడం ఖాయం (2)
కళ్ళు తెరచుకో నేస్తమా - ఆ.. కలుసుకో యేసుని మిత్రమా (2)  ||పువ్వు||

2.జ్ఞానమున్నదని నీవు బ్రతికినా గాని - డబ్బుతో కాలాన్ని గడిపినా గాని (2)
జ్ఞానము నిన్ను తప్పించదు తెలుసా - డబ్బు నిన్ను రక్షించదు తెలుసా
మరణము రాకముందే - అది నిన్ను చేరకముందే (2)
పాపాలు విడువు నేస్తమా - ఆ.. ప్రభుని చేరు మిత్రమా (2)  ||పువ్వు||

3.ఇలలో నీవు నేను స్థిరము కాదుగా - ధరలో మనకేది స్థిరము కాదుగా (2)
ఎంత సంపాదించినా వ్యర్ధము తెలుసా - ఏది నీతో రాదనీ తెలుసా
వాడిపోయి రాలకముందే - ఎత్తి పారవేయక ముందే (2)
పాపాలు విడువు నేస్తమా - ఆ.. ప్రభుని చేరు మిత్రమా (2)  ||పువ్వు|| Puvvulaantidi jeevitam raalipotundi gaddilaantidi jeevitam vaadipotundi (2) E dinamandainaa e kshanamainaa (2) Raalipotundi nestamaa aa.. vaadipotundi nestamaa (2) 1.paala raatapaina nadichinaa gaani - pattu vastraale neevu todiginaa gaani (2) Andalamu paina koorchunnaa gaani - andananta sthitilo neevunnaa gaani Kannu mooyadam khaayam - ninnu moyadam khaayam (2) Kallu terachuko nestamaa - aa.. kalusuko yesuni mitramaa (2) ||puvvu|| 2.jnyaanamunnadani neevu bratikinaa gaani - dabbuto kaalaanni gadipinaa gaani (2) Jnyaanamu ninnu tappinchadu telusaa - dabbu ninnu rakshinchadu telusaa Maranamu raakamunde - adi ninnu cherakamunde (2) Paapaalu viduvu nestamaa - aa.. prabhuni cheru mitramaa (2) ||puvvu|| 3.ilalo neevu nenu sthiramu kaadugaa - dharalo manakedi sthiramu kaadugaa (2) Enta sampaadinchinaa vyardhamu telusaa - edi neeto raadanee telusaa Vaadipoyi raalakamunde - etti paaraveyaka munde (2) Paapaalu viduvu nestamaa - aa.. prabhuni cheru mitramaa (2) ||puvvu||

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు