యెహోవా నా బలమా
యెహోవా నా బలమా - యదార్థమైనది నీ మార్గం
పరిపూర్ణమైనది నీ మార్గం - (2) llయెహోవాll
1.నా శత్రువులు నను చుట్టిననూ - నరకపు పాశములరికట్టిననూ (2)
వరదవలె భక్తిహీనులు - పొర్లిన విడువక నను ఎడబాయని దేవా (2) llయెహోవాll
2.మరణపుటురులలో మరువక మొరలిడ - ఉన్నతదుర్గమై రక్షనశృంగమై (2)
తన ఆలయములో నా మొఱ్ఱ వినెను - ఆదరెను ధరణి భయకంపముచే (2) llయెహోవాll
3.నా దీపమును వెలిగించువాడు- నా చీకటిని వెలుగుగా చేయును (2)
జలరాసులనుండి బలమైన చేతితో వెలుపల చేర్చిన బలమైన దేవుడు (2) llయెహోవాll
4.పౌరుషముగల ప్రభు కొపింపగా - పర్వతముల పునాదులు వణకెను (2)
తన నోటనుండి వచ్చిన అగ్ని దహించివేసెను వైరులనెల్లన్ (2) llయెహోవాll
5.మేఘములపై ఆయన వచ్చును - మేఘములను తన మాటుగ జేయును (2)
ఉరుముల మెరుపుల మెండుగ జేసి - అపజయమిచ్చును అపవాదికిని (2) llయెహోవాll
6.దయగలవారిపై దయ చూపించును - కఠినులయెడల వికటము జూపును (2)
గర్విష్టుల యొక్క గర్వమునణుచును సర్వమునెరిగిన సర్వాధికారి (2) llయెహోవాll
7.నా కాళ్ళను లేడి కాళ్లుగా జేయును - ఎత్తైన స్థలములో శక్తితో నిలిపి (2)
రక్షణ కేడెము నాకందించి అక్షయముగ తన పక్షము జేర్చిన (2) llయెహోవాll
8.యెహోవా జీవముగల దేవా - బహుగా స్తుతులకు అర్హుడ నీవే (2)
అన్యజనులలో ధన్యత చూపుచు హల్లెలూయ స్తుతిగానము చేసెద (2) llయెహోవాll
Yehovaa naa balamaa - yadaarthamainadi nee maargam Paripoornamainadi nee maargam - (2) llyehovaall 1.naa shatruvulu nanu chuttinanoo - narakapu paashamularikattinanoo (2) Varadavale bhaktiheenulu - porlina viduvaka nanu edabaayani devaa (2) llyehovaall 2.maranaputurulalo maruvaka moralida - unnatadurgamai rakshanashrungamai (2) Tana aalayamulo naa morra vinenu - aadarenu dharani bhayakampamuche (2) llyehovaall 3.naa deepamunu veliginchuvaadu- naa cheekatini velugugaa cheyunu (2) Jalaraasulanundi balamaina chetito velupala cherchina balamaina devudu (2) llyehovaall 4.paurushamugala prabhu kopimpagaa - parvatamula punaadulu vanakenu (2) Tana notanundi vachchina agni dahinchivesenu vairulanellan (2) llyehovaall 5.meghamulapai aayana vachchunu - meghamulanu tana maatuga jeyunu (2) Urumula merupula menduga jesi - apajayamichchunu apavaadikini (2) llyehovaall 6.dayagalavaaripai daya choopinchunu - kathinulayedala vikatamu joopunu (2) garvishtula yokka garvamunanuchunu sarvamunerigina sarvaadhikaari (2) llyehovaall 7.naa kaallanu ledi kaallugaa jeyunu - ettaina sthalamulo shaktito nilipi (2) rakshana kedemu naakandinchi akshayamuga tana pakshamu jerchina (2) llyehovaall 8.yehovaa jeevamugala devaa - bahugaa stutulaku arhuda neeve (2) anyajanulalo dhanyata choopuchu hallelooya stutigaanamu cheseda (2) llyehovaall
Comments
Post a Comment