పరవాసిని నే జగమున ప్రభువా

పరవాసిని నే జగమున ప్రభువా - నడచుచున్నాను నా దారిన్
నా గురి నీవే నా ప్రభువా - నీ దరి నే జేరెదను
నేను.. నీ దరి నే జేరెదను     ||పరవాసిని||

1.లోకమంతా నాదని యెంచి - బంధు మిత్రులే ప్రియులనుకొంటిని (2)
అంతయు మోసమేగా - వ్యర్ధము సర్వము -ఇలలో.. ఇలలో  llపరవాసినిll

2.ధన సంపదలు గౌరవములు - దహించిపోవు నీ లోకములో
పాపము నిండె జగములో - శాపము చేకూర్చుకొనే లోకము.. శాపము  ||పరవాసిని||

3.తెలుపుము నా అంతము నాకు - తెలుపుము నా ఆయువు యెంతో
తెలుపుము ఎంత అల్పుడనో - విరిగి నలిగియున్నాను - నేను  ||పరవాసిని||

4.ఆ దినము ప్రభు గుర్తెరిగితిని - నీ రక్తముచే మార్చబడితిని
క్షమాపణ పొందితివనగా - మహాదానందము కలిగె - నాలో    ||పరవాసిని||

5.యాత్రికుడనై ఈ లోకములో - సిలువ మోయుచు సాగెదనిలలో
అమూల్యమైన ధనముగా - పొందితిని నేను - యేసుని  నేను  ||పరవాసిని||

6.నా నేత్రములు మూయబడగా - నాదు యాత్ర ముగియు నిలలో
చేరుదున్ పరలోక దేశము - నాదు గానము యిదియే యిలలో  ||పరవాసిని|| Paravaasini ne jagamuna prabhuvaa - nadachuchunnaanu naa daarin Naa guri neeve naa prabhuvaa - nee dari ne jeredanu Nenu.. nee dari ne jeredanu ||paravaasini|| 1.lokamantaa naadani yenchi - bandhu mitrule priyulanukontini (2) Antayu mosamegaa - vyardhamu sarvamu -ilalo.. ilalo llparavaasinill 2.dhana sampadalu gauravamulu - dahinchipovu nee lokamulo Paapamu ninde jagamulo - shaapamu chekoorchukone lokamu.. shaapamu ||paravaasini|| 3.telupumu naa antamu naaku - telupumu naa aayuvu yento Telupumu enta alpudano - virigi naligiyunnaanu - nenu ||paravaasini|| 4.aa dinamu prabhu gurterigitini - nee raktamuche maarchabaditini Kshamaapana ponditivanagaa - mahaadaanandamu kalige - naalo ||paravaasini|| 5.yaatrikudanai ee lokamulo - siluva moyuchu saagedanilalo Amoolyamaina dhanamugaa - ponditini nenu - yesuni nenu ||paravaasini|| 6.naa netramulu mooyabadagaa - naadu yaatra mugiyu nilalo Cherudun paraloka deshamu - naadu gaanamu yidiye yilalo ||paravaasini||

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు