రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు

రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు

వాంఛతో తన కరము చాపి రమ్మనుచున్నాడు (2)


1.ఎటువంటి శ్రమలందును - ఆదరణ నీకిచ్చునని (2)
గ్రహించి నీవు యేసుని చూచిన - హద్దు లేని ఇంపు పొందెదవు (2) llరమ్మనుll

2.కన్నీరంతా తుడుచును - కనుపాపవలె కాపాడున్ (2)
కారు మేఘమువలె కష్టములు వచ్చిననూ - కనికరించి నిన్ను కాపాడును (2) llరమ్మనుll

3.సోమ్మసిల్లు వేళలో - బలమును నీకిచ్చును (2)
ఆయన నీ వెలుగు రక్షణనై యుండును - ఆలసింపక త్వరపడి రమ్ము (2) llరమ్మనుll

4.సకల వ్యాధులను - స్వస్థత పరచుటకు (2)
శక్తిమంతుడగు ప్రభు యేసు ప్రేమతో - అందరికి తన కృపలనిచ్చున్ (2) llరమ్మనుll Rammanuchunnaadu ninnu prabhu yesu Vaanchhato tana karamu chaapi rammanuchunnaadu (2) 1.etuvanti shramalandunu - aadarana neekichchunani (2) Grahinchi neevu yesuni choochina - haddu leni impu pondedavu (2) llrammanull 2.kanneerantaa tuduchunu - kanupaapavale kaapaadun (2) Kaaru meghamuvale kashtamulu vachchinanoo - kanikarinchi ninnu kaapaadunu (2) llrammanull 3.sommasillu velalo - balamunu neekichchunu (2) Aayana nee velugu rakshananai yundunu - aalasimpaka tvarapadi rammu (2) llrammanull 4.sakala vyaadhulanu - svasthata parachutaku (2) Shaktimantudagu prabhu yesu premato - andariki tana krupalanichchun (2) llrammanull


Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు