పాడెద దేవా – నీ కృపలన్
పాడెద దేవా నీ కృపలన్ - నూతన గీతములన్
స్తోత్రము చెల్లింతున్ – స్తుతి స్తోత్రము చెల్లింతున్ (2)
1.భూమి పునాదులు వేయకముందే - యేసులో చేసితివి (2)
ప్రేమ పునాదులు వేసితివి
దీనుని బ్రోచితివి – ఈ దీనుని బ్రోచితివి (2) ||పాడెద||
2.ప్రవిమల రక్తము కలువరి సిలువలో
కలునకు నిచ్చితివి (2)
ప్రేమ కృపా మహదైశ్వర్యములతో
పాపము తుడిచితివి – నా పాపము తుడిచితివి (2) ||పాడెద||
3.పాపము శాపము నరకపు వేదన
మరి తొలగించితివి (2)
అపరాధములచే చచ్చిన నన్ను
ధర బ్రతికించితివి – నన్ను బ్రతికించితివి (2) ||పాడెద||
4.దేవుని రాజ్యపు వారసుడనుగా
క్రీస్తులో చేసితివి (2)
చీకటి రాజ్యపు శక్తుల నుండి
నను విడిపించితివి – చెర నను విడిపించితివి (2) ||పాడెద||
5.ముద్రించితివి శుద్ధాత్మతో నను
భద్రము చేసితివి (2)
సత్యస్వరూప నిత్యనివాసి
సొత్తుగా చేసితివి – నీ సొత్తుగా చేసితివి (2) ||పాడెద||
6.అన్యుడనై నిను ఎరుగక యున్నను
ధన్యుని చేసితివి (2)
ప్రియ పట్టణ పౌరుల సేవింపను
వరముల నొసగితివి – కృప వరముల నొసగితివి (2) ||పాడెద||
Paadeda devaa nee krupalan - nootana geetamulan
Stotramu chellintun – stuti stotramu chellintun (2)
1.bhoomi punaadulu veyakamunde - yesulo chesitivi (2)
Prema punaadulu vesitivi
Deenuni brochitivi – ee deenuni brochitivi (2) ||paadeda||
2.pravimala raktamu kaluvari siluvalo
Kalunaku nichchitivi (2)
Prema krupaa mahadaishvaryamulato
Paapamu tudichitivi – naa paapamu tudichitivi (2) ||paadeda||
3.paapamu shaapamu narakapu vedana
Mari tolaginchitivi (2)
Aparaadhamulache chachchina nannu
Dhara bratikinchitivi – nannu bratikinchitivi (2) ||paadeda||
4.devuni raajyapu vaarasudanugaa
Kreestulo chesitivi (2)
Cheekati raajyapu shaktula nundi
Nanu vidipinchitivi – chera nanu vidipinchitivi (2) ||paadeda||
5.mudrinchitivi shuddhaatmato nanu
Bhadramu chesitivi (2)
Satyasvaroopa nityanivaasi
Sottugaa chesitivi – nee sottugaa chesitivi (2) ||paadeda||
6.anyudanai ninu erugaka yunnanu
Dhanyuni chesitivi (2)
Priya pattana paurula sevimpanu
Varamula nosagitivi – krupa varamula nosagitivi (2) ||paadeda||
Comments
Post a Comment