రాకడనే రైలు బండి వస్తున్నది

రాకడనే రైలు బండి వస్తున్నది

రెండవ రాకడనే రైలు బండి వస్తున్నది (2)

పరిశుద్ధులకందులో చోటున్నది (2)

మంచి చోటున్నది – భలే చోటున్నది

చక్కని సీటున్నది      ||రాకడనే||


1.సత్యమనే చక్రములు దానికున్నవి
శాంతి అనెడి పైకప్పు దానికున్నది (2)
పాపములను క్షమియించే బ్రేకులున్నవి – బండికి బ్రేకులున్నవి
జీవమునకు మార్గమని కూయుచున్నది – కూత కూయుచున్నది   ||రాకడనే||

2.ప్రతి దినము బైబిలును పఠియించుము
ప్రార్దననెడి విజ్ఞాపన వివరించుము – ప్రభుకి వివరించుము
ఎదురు వీచే గాలులనెడి వ్యాధి బాధలన్
సాతాను చిక్కులను యేసు రక్తమందు కడిగి
జయము పొందుము – పవిత్రుడవు కమ్ము  ||రాకడనే||

3.తండ్రి కుమారాత్మలనే రైలు బండిది
ఇంజను డ్రైవరు పేరు యెహోవాండి (2)
పరిశుద్ధ ఆత్మ అనెడి గార్డు ఉన్నాడు – బండికి గార్డు ఉన్నాడు
సిలువ జెండా ఎత్తి చూపి బండి నిలుపుము – నీవు ప్రవేశించుము  ||రాకడనే||

4.రక్షణనే టిక్కెట్టు దానికున్నది (2)
మారు మారుమనస్సు పొంది మీరు
ముందుకు రండి – టిక్కెట్టు కొనండి (2)   ||రాకడనే||

5.పాపులున్న స్టేషనులో బండి ఆగదు (2)
పరిశుద్ధుల స్టేషనులో
బండి ఆగును – రైలు బండి ఆగును (2)   ||రాకడనే|| Raakadane railu bandi vastunnadi Rendava raakadane railu bandi vastunnadi (2) Parishuddhulakandulo chotunnadi (2) Manchi chotunnadi – bhale chotunnadi Chakkani seetunnadi ||raakadane|| 1.satyamane chakramulu daanikunnavi Shaanti anedi paikappu daanikunnadi (2) Paapamulanu kshamiyinche brekulunnavi – bandiki brekulunnavi Jeevamunaku maargamani kooyuchunnadi – koota kooyuchunnadi ||raakadane|| 2.prati dinamu baibilunu pathiyinchumu Praardananedi vijnyaapana vivarinchumu – prabhuki vivarinchumu Eduru veeche gaalulanedi vyaadhi baadhalan Saataanu chikkulanu yesu raktamandu kadigi Jayamu pondumu – pavitrudavu kammu ||raakadane|| 3.tandri kumaaraatmalane railu bandidi Injanu draivaru peru yehovaandi (2) Parishuddha aatma anedi gaardu unnaadu – bandiki gaardu unnaadu Siluva jendaa etti choopi bandi nilupumu – neevu praveshinchumu ||raakadane|| 4.rakshanane tikkettu daanikunnadi (2) Maaru maarumanassu pondi meeru Munduku randi – tikkettu konandi (2) ||raakadane|| 5.paapulunna steshanulo bandi aagadu (2) Parishuddhula steshanulo Bandi aagunu – railu bandi aagunu (2) ||raakadane||


Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు