పరలోకము నా దేశము

పరలోకము నా దేశము పరదేశి నేనిల - మాయలోకమేగ నేను యాత్రికుడను  (2)

1.ఎంతో అందమైనది పరలోకము - అసమానమైనది నా దేశము
ఎల్లప్పుడు విశ్వాసముతో యాత్రను సాగింతును  ||పరలోకము||

2.దూతలు పాడుచుందురు పరమందున - దీవా రాత్రమునందు
పాడుచుందురు - పావనుని చూచి నేను హర్షింతును నిత్యము  ||పరలోకము||

3.రక్షకుని చెంతకు ఎప్పుడేగెదన్ - వీక్షించెద నెప్పుడు నాదు ప్రియుని
కాంక్షించెద నా మదిలో ఆయన చెంతనుండ  ||పరలోకము||

4.అద్దరికి ఎప్పుడు నేను వెళ్లెదన్ - అగుపడుచున్నది గమ్యస్థానము
అచ్చటనే చూచెదను పరిశుద్ధులెల్లరిన్   ||పరలోకము||

5.నిత్యానందముండును పరమందున - నిత్య సమాధానము
ఉండు నచ్చట పొందెదను విశ్రాంతిని శ్రమలన్నియు వీడి   ||పరలోకము|| Paralokamu naa deshamu paradeshi nenila - maayalokamega nenu yaatrikudanu (2) 1.ento andamainadi paralokamu - asamaanamainadi naa deshamu Ellappudu vishvaasamuto yaatranu saagintunu ||paralokamu|| 2.dootalu paaduchunduru paramanduna - deevaa raatramunandu Paaduchunduru - paavanuni choochi nenu harshintunu nityamu ||paralokamu|| 3.rakshakuni chentaku eppudegedan - veekshincheda neppudu naadu priyuni Kaankshincheda naa madilo aayana chentanunda ||paralokamu|| 4.addariki eppudu nenu velledan - agupaduchunnadi gamyasthaanamu Achchatane choochedanu parishuddhulellarin ||paralokamu|| 5.nityaanandamundunu paramanduna - nitya samaadhaanamu Undu nachchata pondedanu vishraantini shramalanniyu veedi ||paralokamu||

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు