రాజాధి రాజ రవి కోటి తేజ

రాజాధి రాజ రవి కోటి తేజ

రమణీయ సామ్రాజ్య పరిపాలక (2)

విడువని కృప నాలో స్థాపించెనే

సీయోనులో నున్న స్తుతుల సింహాసనమును (2)   ||రాజాధి||


1.వర్ణనకందని పరిపూర్ణమైన నీ
మహిమ స్వరూపమును – నా కొరకే త్యాగము చేసి (2)
కృపా సత్యములతో కాపాడుచున్నావు
దినమెల్ల నీ కీర్తి మహిమలను – నేను ప్రకటించెద (2)  ||రాజాధి||

2.ఊహలకందని ఉన్నతమైన నీ
ఉద్దేశములను – నా యెడల సఫలపరచి (2)
ఊరేగించుచున్నావు విజయోత్సవముతో
యేసయ్య నీ కన్నా తోడెవ్వరు – లేరు ఈ ధరణిలో (2)  ||రాజాధి||

3.మకుటము ధరించిన మహారాజువై నీ
సౌభాగ్యమును – నా కొరకే సిద్ధపరచితివి (2)
నీ పరిశుద్ధమైన మార్గములో నడిచి
నీ సాక్షినై కాంక్షతో పాడెద – స్తోత్ర సంకీర్తనలే (2)   ||రాజాధి|| Raajaadhi raaja ravi koti teja Ramaneeya saamraajya paripaalaka (2) Viduvani krupa naalo sthaapinchene Seeyonulo nunna stutula sinhaasanamunu (2) ||raajaadhi|| 1.varnanakandani paripoornamaina nee Mahima svaroopamunu – naa korake tyaagamu chesi (2) Krupaa satyamulato kaapaaduchunnaavu Dinamella nee keerti mahimalanu – nenu prakatincheda (2) ||raajaadhi|| 2.oohalakandani unnatamaina nee Uddeshamulanu – naa yedala saphalaparachi (2) Ooreginchuchunnaavu vijayotsavamuto Yesayya nee kannaa todevvaru – leru ee dharanilo (2) ||raajaadhi|| 3.makutamu dharinchina mahaaraajuvai nee Saubhaagyamunu – naa korake siddhaparachitivi (2) Nee parishuddhamaina maargamulo nadichi Nee saakshinai kaankshato paadeda – stotra sankeertanale (2) ||raajaadhi||


Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు