యేసయ్యా నా యేసయ్యా ఎపుడయ్యా నీ రాకడ

యేసయ్యా నా యేసయ్యా ఎపుడయ్యా నీ రాకడ

రమ్ము రమ్ము యేసునాథ వేగమె రారమ్ము

ఆమెన్ ఆమెన్ హల్లెలూయ ఆమెన్ హల్లెలూయ


1.చూచుటకెన్నో వింతలున్నవి ఈ భువిలోన
చూడగా ఎందరో ఘనులున్నారు ఈ ధరలోన
ఏమి చూచిన ఎవరిని చూచిన ఫలమేమి
నా కన్నులారా నిన్ను చూడాలి యేసయ్యా     ||రమ్ము||

2.నా రూపమే మారునంట నిన్ను చూచువేళ
నిన్ను పోలి ఉండెదనంట నీవు వచ్చు వేళ
అనంతమైన నీ రాజ్యమే నా స్వదేశమయ్యా
అందుండు సర్వ సంపదలన్నీ నా స్వంతమయ్యా  ||రమ్ము||

3.అమూల్యమైన రత్నములతో అలంకరించబడి
గొర్రెపిల్ల దీపకాంతితో ప్రకాశించుచున్న
అంధకారమే లేని ఆ దివ్యనగరమందు
అవధులు లేని ఆనందముతో నీతో నుండెదను   ||రమ్ము||


Yesayyaa naa yesayyaa epudayyaa nee raakada Rammu rammu yesunaatha vegame raarammu Aamen aamen hallelooya aamen hallelooya 1.choochutakenno vintalunnavi ee bhuvilona Choodagaa endaro ghanulunnaaru ee dharalona Emi choochina evarini choochina phalamemi Naa kannulaaraa ninnu choodaali yesayyaa ||rammu|| 2.naa roopame maarunanta ninnu choochuvela Ninnu poli undedananta neevu vachchu vela Anantamaina nee raajyame naa svadeshamayyaa Andundu sarva sampadalannee naa svantamayyaa ||rammu|| 3.amoolyamaina ratnamulato alankarinchabadi Gorrepilla deepakaantito prakaashinchuchunna Andhakaarame leni aa divyanagaramandu Avadhulu leni aanandamuto neeto nundedanu ||rammu||

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు