రండి ఉత్సాహించి పాడుదము

రండి ఉత్సాహించి పాడుదము - రక్షణ దుర్గము మన ప్రభువే (2)


1.రండి కృతజ్ఞత స్తోత్రముతో - రారాజు సన్నిధికేగుదము (2)
సత్ప్రభు నామము కీర్తనలన్ - సంతోష గానము చేయుదము   ||రండి||

2.మన ప్రభువే మహా దేవుండు - ఘన మహాత్యము గల రాజు (2)
భూమ్యాగాధపు లోయలును - భూధర శిఖరములాయనవే      ||రండి||

3.సముద్రము సృష్టించెనాయనదే - సత్యుని హస్తమే భువిజేసెన్ (2)
ఆయన దైవము పాలితుల - ఆయన మేపెడి గొర్రెలము        ||రండి||

4.ఆ ప్రభు సన్నిధి మోకరించి - ఆయన ముందర మ్రొక్కుదము (2)
ఆయన మాటలు గైకొనిన - అయ్యవి మనకెంతో మేలగును   ||రండి||

5.తండ్రి కుమార శుద్దాత్మకును - తగు స్తుతి మహిమలు కల్గు గాక (2)
ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడూ - అయినట్లు యుగములనౌను ఆమెన్  ||రండి|| Randi utsaahinchi paadudamu - rakshana durgamu mana prabhuve (2) 1.randi krutajnyata stotramuto - raaraaju sannidhikegudamu (2) Satprabhu naamamu keertanalan - santosha gaanamu cheyudamu ||randi|| 2.mana prabhuve mahaa devundu - ghana mahaatyamu gala raaju (2) Bhoomyaagaadhapu loyalunu - bhoodhara shikharamulaayanave ||randi|| 3.samudramu srushtinchenaayanade - satyuni hastame bhuvijesen (2) Aayana daivamu paalitula - aayana mepedi gorrelamu ||randi|| 4.aa prabhu sannidhi mokarinchi - aayana mundara mrokkudamu (2) Aayana maatalu gaikonina - ayyavi manakento melagunu ||randi|| 5.tandri kumaara shuddaatmakunu - tagu stuti mahimalu kalgu gaaka (2) Aadini ippudu ellappudoo - ayinatlu yugamulanaunu aamen ||randi||


Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు