యెహోవ నా మొర లాలించెను
యెహోవ నా మొర లాలించెను
దన మహా దయను నను గనించెను
అహర్నిశల దీనహీనుడగు నా
దు హాయనెడు ధ్వని గ్రహించి మనిపెను ||యెహోవ||
1.పిశాచి గడిమి బడగొట్టెను
దన వశాన నను నిలువ బెట్టెను
ప్రశాంత మధుర సు విశేష వాక్ఫల
నిశాంతమున జే ర్చి సేద దీర్చెను ||యెహోవ||
2.మదావలము బోలు నా మదిన్
దన ప్రదీప్త వాక్యం కూశా హతిన్
యధేచ్చలన్నిటి గుదించి పాపపు
మొదల్ తుదల్ నరి కి దరికి జేర్చెను ||యెహోవ||
3.అనీతి వస్త్ర మెడలించెను
యే సునాథు రక్తమున ముంచెను
వినూత్న యత్నమే ద నూని యెన్నడు
గనన్ వినన్ బ్రే మ నాకు జూపెను ||యెహోవ||
4.విలాపములకు జెవి నిచ్చెను
శ్రమ కలాపములకు సెలవిచ్చెను
శిలానగము పై కిలాగి నను సుఖ
కళావళుల్ మన సులోన నిలిపెను ||యెహోవ||
5.అగణ్య పాపియని త్రోయక
న న్ను గూర్చి తన సుతుని దా చక
తెగించి మృతి కొ ప్పగించి పాపపు
నెగుల్ దిగుల్ సొగ సుగా నణంచెను ||యెహోవ||
Yehova naa mora laalinchenu
Dana mahaa dayanu nanu ganinchenu
Aharnishala deenaheenudagu naa
Du haayanedu dhvani grahinchi manipenu ||yehova||
1.pishaachi gadimi badagottenu
dana vashaana nanu niluva bettenu
prashaanta madhura su vishesha vaakphala
nishaantamuna je rchi seda deerchenu ||yehova||
2.madaavalamu bolu naa madin
dana pradeepta vaakyam kooshaa hatin
yadhechchalanniti gudinchi paapapu
modal tudal nari ki dariki jerchenu ||yehova||
3.aneeti vastra medalinchenu
ye sunaathu raktamuna munchenu
vinootna yatname da nooni yennadu
ganan vinan bre ma naaku joopenu ||yehova||
4.vilaapamulaku jevi nichchenu
shrama kalaapamulaku selavichchenu
shilaanagamu pai kilaagi nanu sukha
kalaavalul mana sulona nilipenu ||yehova||
5.aganya paapiyani troyaka
na nnu goorchi tana sutuni daa chaka
teginchi mruti ko ppaginchi paapapu
negul digul soga sugaa nananchenu ||yehova||
Comments
Post a Comment