యేసయ్యా నిన్ను చూడాలని ఆశ

యేసయ్యా నిన్ను చూడాలని ఆశ

మెస్సయ్యా నిన్ను చేరాలని ఆశ (2)

ఎవరు ఉన్నారు నాకు ఈ లోకంలో

ఎవరు ఉంటారు తోడు నా జీవితమందు

ఇమ్మానుయేలైన నా దైవం నీవేగా (2)  ||యేసయ్యా||


అందరు ఉన్నారని అందరు నావారని (2)
తలచితిని భ్రమచితిని చివరికి ఒంటరి నేనైతిని (2)
చివరికి ఒంటరి నేనైతిని
నా గానం నీవయ్యా నా ధ్యానం నీవయ్యా
నా ప్రాణం నీవయ్యా నా సర్వం నీవయ్యా  ||యేసయ్యా||


అంధకారములో అంధుడ నేనైతిని (2)
నిను చూచే నేత్రములు నాకొసగుమా నజరేయుడా (2)
నాకొసగుమా నజరేయుడా
నా ఆశ నీవయ్యా నా ధ్యాస నీవయ్యా
నా భాష నీవయ్యా నా శ్వాస నీవయ్యా  ||యేసయ్యా||

Comments

Popular posts from this blog

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు

నీ చేతితో నన్ను పట్టుకో