రక్షకుండుదయించినాడట – మన కొరకు పరమ
రక్షకుండుదయించినాడట – మన కొరకు పరమ
రక్షకుండుదయించినాడట
రక్షకుండుదయించినాడు – రారే గొల్ల బోయలార
తక్షనమున బోయి మన ని – రీక్షణ ఫల మొందెదము ||రక్షకుండు||
1.దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు (2)
దేవుడగు యెహోవా మన – దిక్కు దేరి చూచినాడు ||రక్షకుండు||
2.గగనము నుండి డిగ్గి – ఘనుడు గాబ్రియేలు దూత (2)
తగినట్టు చెప్పే వారికి – మిగుల సంతోష వార్త ||రక్షకుండు||
3.వర్తమానము జెప్పి దూత – వైభవమున పోవుచున్నాడు (2)
కర్తను జూచిన వెనుక – కాంతుము విశ్రమం బప్పుడు ||రక్షకుండు||
4.పశువుల తొట్టిలోన – భాసిల్లు వస్త్రముల జుట్టి (2)
శిశువును గనుగొందురని – శీఘ్రముగను దూత తెల్పె ||రక్షకుండు||
5.అనుచు గొల్ల లొకరి కొకరు – ఆనవాలు జెప్పుకొనుచు (2)
అనుమతించి కడకు క్రీస్తు – నందరికినీ దెల్పినారు ||రక్షకుండు||
Rakshakundudayinchinaadata – mana koraku parama
Rakshakundudayinchinaadata
Rakshakundudayinchinaadu – raare golla boyalaara
Takshanamuna boyi mana ni –
reekshana phala mondedamu ||rakshakundu||
1.daaveedu vanshamandu dhanyudu janminchinaadu (2)
Devudagu yehovaa mana –
dikku deri choochinaadu ||rakshakundu||
2.gaganamu nundi diggi –
ghanudu gaabriyelu doota (2)
Taginattu cheppe vaariki –
migula santosha vaarta ||rakshakundu||
3.vartamaanamu jeppi doota –
vaibhavamuna povuchunnaadu (2)
Kartanu joochina venuka –
kaantumu vishramam bappudu ||rakshakundu||
4.pashuvula tottilona –
bhaasillu vastramula jutti (2)
Shishuvunu ganugondurani –
sheeghramuganu doota telpe ||rakshakundu||
5.anuchu golla lokari kokaru –
aanavaalu jeppukonuchu (2)
Anumatinchi kadaku kreestu –
nandarikinee delpinaaru ||rakshakundu||
Comments
Post a Comment