ఆహా మహాత్మ హా శరణ్య – హా విమోచకా
1.ఆహా మహాత్మ హా శరణ్య – హా విమోచకా
ద్రోహ రహిత చంపె నిను నా – దోషమే కదా ||ఆహా||
2.వీరలను క్షమించు తండ్రి – నేరమేమియున్
కోరిటితుల నిన్ను చంపు – కౄర జనులకై ||ఆహా||
3.నీవు నాతో పరదైసున – నేడే యుందువు
పావనుండ ఇట్లు పలికి – పాపి గాచితి ||ఆహా||
4.అమ్మా నీ సుతుడటంచు మరి-యమ్మతో పలికి
క్రమ్మర నీ జనని యంచు – కర్త నుడితివి ||ఆహా||
5.నా దేవ దేవ యేమి విడ-నాడితి వనుచు
శ్రీ దేవ సుత పలికితివి శ్రమ – చెప్ప శక్యమా ||ఆహా||
6.దప్పిగొనుచున్నానటంచు – చెప్పితివి కదా
యిప్పగిదిని బాధ నొంద – నేమి నీకు హా ||ఆహా||
7.శ్రమ ప్రమాద-ములను గొప్ప – శబ్ద మెత్తి హా
సమాప్తమైనదంచు తెలిపి – సమసితివి కదా ||ఆహా||
8.అప్పగింతు తండ్రి నీకు – నాత్మ నంచును
గొప్ప యార్భాటంబు చేసి – కూలిపోతివా ||ఆహా||
1.aahaa mahaatma haa sharanya – haa vimochakaa
Droha rahita champe ninu naa – doshame kadaa ||aahaa||
2.veeralanu kshaminchu tandri – neramemiyun
Korititula ninnu champu – kruura janulakai ||aahaa||
3.neevu naato paradaisuna – nede yunduvu
Paavanunda itlu paliki – paapi gaachiti ||aahaa||
4.ammaa nee sutudatanchu mari-yammato paliki
Krammara nee janani yanchu – karta nuditivi ||aahaa||
5.naa deva deva yemi vida-naaditi vanuchu
Shree deva suta palikitivi shrama – cheppa shakyamaa ||aahaa||
6.dappigonuchunnaanatanchu – cheppitivi kadaa
Yippagidini baadha nonda – nemi neeku haa ||aahaa||
7.shrama pramaada-mulanu goppa – shabda metti haa
Samaaptamainadanchu telipi – samasitivi kadaa ||aahaa||
8.appagintu tandri neeku – naatma nanchunu
Goppa yaarbhaatambu chesi – koolipotivaa ||aahaa||
Comments
Post a Comment