ఆరాధన స్తుతి ఆరాధన

ఆరాధన స్తుతి ఆరాధన. (3)
“నీవంటి వారు ఒక్కరును లేరు
నీవే అతి శ్రేష్టుడా
దూత గణములు నిత్యము కొలిచే
నీవే పరిశుద్దుడా
నిన్నా నేడు మారని”.     ||ఆరాధన||

అబ్రహాము ఇస్సాకును
బలి ఇచ్చినారాధన
రాళ్ళతో చంపబడిన
స్తెఫను వలె ఆరాధన.   (2)

ఆరాధన స్తుతి ఆరాధన. (2)
పదివేలలోన అతి సుందరుడా
నీకే ఆరాధన.
ఇహ పరములోన ఆకాంక్షనీయుడా
నీకు సాటెవ్వరు.
నిన్నా నేడు మారని .     ||ఆరాధన||

దానియేలు సింహపు బోనులో
చేసిన ఆరాధన.
వీధులలో నాట్యమాడిన
దావీదు ఆరాధన. (2)

ఆరాధన స్తుతి ఆరాధన (2)
నీవంటి వారు ఒక్కరును లేరు
నీవే అతి శ్రేష్టుడా.
దూత గణములు నిత్యము కొలిచే
నీవే పరిశుద్దుడా
నిన్నా నేడు మారని.      ||ఆరాధన||

Comments

Popular posts from this blog

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు

నీ చేతితో నన్ను పట్టుకో