ఆనందం నీలోనే – ఆధారం నీవేగా

“ఆనందం నీలోనే – ఆధారం నీవేగా
ఆశ్రయం నీలోనే – నా యేసయ్యా – స్తోత్రార్హుడు
అర్హతేలేని నన్ను – ప్రేమించినావు
జీవింతు ఇలలో – నీ కోసమే – సాక్ష్యార్థమై”.   ||ఆనందం||

1.పదే పదే నిన్నే చేరగా - ప్రతిక్షణం నీవే ధ్యాసగా (2)
కలవరాల కోటలో – కన్నీటి బాటలో (2)
కాపాడే కవచంగా – నన్ను ఆవరించిన
దివ్యక్షేత్రమా – స్తోత్రగీతమా.   ||ఆనందం||

2.నిరంతరం నీవే వెలుగని - నిత్యమైన స్వాస్థ్యం నీదని (2)
నీ సన్నిధి వీడక – సన్నుతించి పాడనా (2)
నీకొరకే ధ్వజమెత్తి నిన్న ప్రకటించనా
సత్యవాక్యమే – జీవవాక్యమే.   ||ఆనందం||

3.సర్వసత్యమే నా మార్గమై - సంఘక్షేమమే నా ప్రాణమై (2)
లోక మహిమ చూడక – నీ జాడలు వీడక (2)
నీతోనే నిలవాలి నిత్య సీయోనులో
ఈ దర్శనం – నా ఆశయం.   ||ఆనందం|| “aanandam neelone – aadhaaram neevegaa Aashrayam neelone – naa yesayyaa – stotraarhudu Arhateleni nannu – preminchinaavu Jeevintu ilalo – nee kosame – saakshyaarthamai”. ||aanandan|| 1.pade pade ninne cheragaa - pratikshanam neeve dhyaasagaa (2) Kalavaraala kotalo – kanneeti baatalo (2) Kaapaade kavachangaa – nannu aavarinchina Divyakshetramaa – stotrageetamaa. ||aanandan|| 2.nirantaram neeve velugani - nityamaina svaasthyam needani (2) Nee sannidhi veedaka – sannutinchi paadanaa (2) Neekorake dhvajametti ninna prakatinchanaa Satyavaakyame – jeevavaakyame. ||aanandan|| 3.sarvasatyame naa maargamai - sanghakshemame naa praanamai (2) Loka mahima choodaka – nee jaadalu veedaka (2) Neetone nilavaali nitya seeyonulo Ee darshanam – naa aashayan. ||aanandan||

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు