ఆలయంలో ప్రవేశించండి అందరు

ఆలయంలో ప్రవేశించండి అందరు
స్వాగతం సుస్వాగతం యేసు నామంలో
మీ హృదయంలో బాధలా కన్నీరా
మీ కన్నీరంతా తుడిచి వేయు రాజు యేసు కోసం.
మీ బ్రతుకులో పాపమా కలతలా      ||ఆలయంలో||

1.దీక్ష స్వభావంతో ధ్యాన స్వభావమై
వెదికే వారికంతా కనబడు దీపము
యేసు రాజు మాటలే వినుట ధన్యము
వినుట వలన విశ్వాసం అధికమధికమై
ఆత్మలో దాహము తీరెను రారండి
ఆనందమానందం హల్లెలూయా.    ||ఆలయంలో||

2.ప్రభు యేసు మాటలే పెదవిలో మాటలై
జీవ వృక్షంబుగా ఫలియించాలని
పెదవితో పలికెదం మంచి మాటలే
హృదయమంతా యేసు ప్రభుని ప్రేమ మాటలై
నింపెదం నిండెదం కోరెదం పొందెదం
ఆనందమానందం హల్లెలూయా.  ||ఆలయంలో|| Aalayanlo praveshinchandi andaru Svaagatam susvaagatam yesu naamanlo Mee hrudayanlo baadhalaa kanneeraa Mee kanneerantaa tudichi veyu raaju yesu kosan. Mee bratukulo paapamaa kalatalaa ||aalayanlo|| 1.deeksha svabhaavanto dhyaana svabhaavamai Vedike vaarikantaa kanabadu deepamu Yesu raaju maatale vinuta dhanyamu Vinuta valana vishvaasam adhikamadhikamai Aatmalo daahamu teerenu raarandi Aanandamaanandam hallelooyaa. ||aalayanlo|| 2.prabhu yesu maatale pedavilo maatalai Jeeva vrukshambugaa phaliyinchaalani Pedavito palikedam manchi maatale Hrudayamantaa yesu prabhuni prema maatalai Nimpedam nindedam koredam pondedam Aanandamaanandam hallelooyaa. ||aalayanlo||

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు