ఊహించలేని మేలులతో నింపిన

ఊహించలేని మేలులతో నింపిన

నా యేసయ్యా నీకే నా వందనం" (2)
వర్ణించగలనా నీ కార్యముల్
వివరించగలనా నీ మేలులన్ . (2)   ||ఊహించలేని||

మేలుతో నా హృదయం తృప్తిపరచినావు
రక్షణ పాత్రనిచ్చి నిను స్తుతియింతును. (2)
ఇశ్రాయేలు దేవుడా నా రక్షకా
స్తుతియింతును నీ నామమున్. (2)   ||ఊహించలేని||

నా దీనస్థితిని నీవు మార్చినావు
నా జీవితానికి విలువనిచ్చినావు . (2)
నీ కృపకు నన్ను ఆహ్వానించినావు
నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు. (2) ||ఊహించలేని||


Comments

Popular posts from this blog

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు

నీ చేతితో నన్ను పట్టుకో