కన్నీరేలమ్మా… కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా

 “ కన్నీరేలమ్మా… కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా

కలవరపడకమ్మా… కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా
కరుణ చూపి కలత మాన్పె ”. (2)
యేసే తోడమ్మా.               ||కన్నీరేలమ్మా||

నీకేమీ లేదని ఏమీ తేలేదని
అన్నారా నిన్ను అవమాన పరిచారా
తల రాత ఇంతేనని తర్వాత ఏమౌనోనని
రేపటిని గూర్చి చింతించుచున్నావా
చింతించకన్న యేసు మాటలు మరిచావా
మారాను మధురంగా మార్చెను చూసావా.  (2)  ||కన్నీరేలమ్మా||

నీకెవరూ లేరని ఏం చేయలేవని
అన్నారా నిన్ను నిరాశపరచారా
పొరుగంటివాడనని ఎప్పటికీ ఇంతేనని
నా బ్రతుకు మారదని అనుకుంటూ ఉన్నావా
నేనున్నానన్న యేసు మాటలు మరిచావా
కన్నీరు నాట్యంగా మార్చును చూస్తావా.  (2)  ||కన్నీరేలమ్మా||


Comments

Popular posts from this blog

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు

నీ చేతితో నన్ను పట్టుకో