ఆశ్చర్యమైన ప్రేమ – కల్వరిలోని ప్రేమ
ఆశ్చర్యమైన ప్రేమ – కల్వరిలోని ప్రేమ
మరణము కంటె బలమైన ప్రేమది
నన్ను జయించె నీ ప్రేమ (2) ||ఆశ్చర్యమైన||
1.పరమును వీడిన ప్రేమ – ధరలో పాపిని వెదకిన ప్రేమ
నన్ను కరుణించి ఆదరించి సేదదీర్చి నిత్య జీవమిచ్చే ||ఆశ్చర్యమైన||
2.పావన యేసుని ప్రేమ – సిలువలో పాపిని మోసిన ప్రేమ
నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమ నిచ్చే ||ఆశ్చర్యమైన||
3.శ్రమలు సహించిన ప్రేమ – నాకై శాపము నోర్చిన ప్రేమ
విడనాడని ప్రేమది ఎన్నడూ యెడబాయదు ||ఆశ్చర్యమైన||
4.నా స్థితి జూచిన ప్రేమ – నాపై జాలిని జూపిన ప్రేమ
నాకై పరుగెత్తి కౌగలించి ముద్దాడి కన్నీటిని తుడిచే ||ఆశ్చర్యమైన||
Aashcharyamaina prema – kalvariloni prema
Maranamu kante balamaina premadi
Nannu jayinche nee prema (2) ||aashcharyamaina||
1.paramunu veedina prema –
dharalo paapini vedakina prema
Nannu karuninchi aadarinchi
sedadeerchi nitya jeevamichche ||aashcharyamaina||
2.paavana yesuni prema –
siluvalo paapini mosina prema
Naakai maraninchi jeevamichchi
jayamichchi tana mahima nichche ||aashcharyamaina||
3.shramalu sahinchina prema –
naakai shaapamu norchina prema
Vidanaadani premadi
ennadoo yedabaayadu ||aashcharyamaina||
4.naa sthiti joochina prema –
naapai jaalini joopina prema
Naakai parugetti kaugalinchi
muddaadi kanneetini tudiche ||aashcharyamaina||
Comments
Post a Comment