ఎడబాయని నీ కృప

ఎడబాయని నీ కృప - నను విడువదు ఎన్నటికీ (2)
యేసయ్యా నీ ప్రేమానురాగం - నను కాయును అనుక్షణం (2)      ||ఎడబాయని||

1.శోకపు లోయలలో – కష్టాల కడగండ్లలో
కడలేని కడలిలో – నిరాశ నిసృహలో (2)
అర్ధమేకాని ఈ జీవితం - ఇక వ్యర్థమని నేననుకొనగా (2)
కృపా కనికరముగల దేవా - నా కష్టాల కడలిని దాటించితివి (2)   ||ఎడబాయని||

2.విశ్వాస పోరాటములో – ఎదురాయె శోధనలు
లోకాశల అలజడిలో – సడలితి విశ్వాసములో (2)
దుష్టుల క్షేమమునే చూచి - ఇక నీతి వ్యర్థమని అనుకొనగా (2)
దీర్ఘశాంతముగల దేవా - నా చేయి విడువక నడిపించితివి (2)      ||ఎడబాయని||

3.నీ సేవలో ఎదురైన – ఎన్నో సమస్యలలో
నా బలమును చూచుకొని – నిరాశ చెందితిని (2)
భారమైన ఈ సేవను - ఇక చేయలేనని అనుకొనగా (2)
ప్రధాన యాజకుడా యేసు - నీ అనుభవాలతో బలపరిచితివి (2)  ||ఎడబాయని|| Edabaayani nee krupa - nanu viduvadu ennatikee (2) Yesayyaa nee premaanuraagam - nanu kaayunu anukshanam (2) ||edabaayani|| 1.shokapu loyalalo – kashtaala kadagandlalo Kadaleni kadalilo – niraasha nisruhalo (2) Ardhamekaani ee jeevitam - ika vyarthamani nenanukonagaa (2) Krupaa kanikaramugala devaa - naa kashtaala kadalini daatinchitivi (2) ||edabaayani|| 2.vishvaasa poraatamulo – eduraaye shodhanalu Lokaashala alajadilo – sadaliti vishvaasamulo (2) Dushtula kshemamune choochi - ika neeti vyarthamani anukonagaa (2) Deerghashaantamugala devaa - naa cheyi viduvaka nadipinchitivi (2) ||edabaayani|| 3.nee sevalo eduraina – enno samasyalalo Naa balamunu choochukoni – niraasha chenditini (2) Bhaaramaina ee sevanu - ika cheyalenani anukonagaa (2) Pradhaana yaajakudaa yesu - nee anubhavaalato balaparichitivi (2) ||edabaayani||

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు