క్రీస్తే సర్వాధికారి – క్రీస్తే మోక్షాధికారి

“క్రీస్తే సర్వాధికారి – క్రీస్తే మోక్షాధికారి

క్రీస్తే మహోపకారి – క్రీస్తే ఆ సిల్వధారి “.  ||క్రీస్తే||

1.ముక్తి విధాత నేత – శక్తి నొసంగు దాత
భక్తి విలాప శ్రోత – పరమంబు వీడె గాన.  ||క్రీస్తే||

2.దివ్య పథంబురోసి – దైవంబు తోడు బాసి
దాసుని రూపు దాల్చి – ధరణి కేతెంచె గాన.  ||క్రీస్తే||

3.శాశ్వత లోకవాసి – సత్యామృతంపు రాశి
శాప భారంబు మోసి – శ్రమల సహించె గాన .  ||క్రీస్తే||

4.సైతాను జనము గూల్పన్ – పాతాళమునకు బంపన్
నీతి పథంబు బెంప – రుధిరంబు గార్చె గాన.     ||క్రీస్తే||

5.మృత్యువు ముళ్ళు తృపన్ – నిత్య జీవంబు బెంపన్
మర్త్యాళి భయము దీర్పన్ – మరణంబు గెలిచె గాన.  ||క్రీస్తే||

6.పరమందు దివిజులైన – ధరయందు మనుజులైన
ప్రతి నాలుక మోకాలు – ప్రభునే భజించు గాన.     ||క్రీస్తే||

7.ఈ నామమునకు మించు – నామంబు లేదటంచు
యెహోవా తండ్రి యేసున్ – హెచ్చించినాడు గాన.   ||క్రీస్తే|| “kreeste sarvaadhikaari – kreeste mokshaadhikaari Kreeste mahopakaari – kreeste aa silvadhaari “. ||kreeste|| 1.mukti vidhaata neta – shakti nosangu daata Bhakti vilaapa shrota – paramambu veede gaana. ||kreeste|| 2.divya pathamburosi – daivambu todu baasi Daasuni roopu daalchi – dharani ketenche gaana. ||kreeste|| 3.shaashvata lokavaasi – satyaamrutampu raashi Shaapa bhaarambu mosi – shramala sahinche gaana . ||kreeste|| 4.saitaanu janamu goolpan – paataalamunaku bampan Neeti pathambu bempa – rudhirambu gaarche gaana. ||kreeste|| 5.mrutyuvu mullu trupan – nitya jeevambu bempan Martyaali bhayamu deerpan – maranambu geliche gaana. ||kreeste|| 6.paramandu divijulaina – dharayandu manujulaina Prati naaluka mokaalu – prabhune bhajinchu gaana. ||kreeste|| 7.ee naamamunaku minchu – naamambu ledatanchu Yehovaa tandri yesun – hechchinchinaadu gaana. ||kreeste||

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు