ఓ సంఘమా సర్వాంగమా

 "ఓ సంఘమా సర్వాంగమా – పరలోక రాజ్యపు ప్రతిబింబమా

యేసయ్యను ఎదుర్కొనగ – నీతి నలంకరించి సిద్ధపడుమా
ఓ సంఘమా వినుమా"

రాణి ఓఫిరు అపరంజితో – స్వర్ణ వివర్ణ వస్త్ర ధారణతో
వీణ వాయిద్య తరంగాలతో – ప్రాణేశ్వరుని ప్రసన్నతతో
ఆనంద తైల సుగంధాభిషేకము. (2)
పొందితినే యేసునందు. (2)    ||ఓ సంఘమా||

క్రీస్తే నిన్ను ప్రేమించెనని – తన ప్రాణ మర్పించెనని
స్వస్థపరచె నిర్దోషముగా – ముడత కళంకము లేనిదిగ
మహిమా యుక్తంబుగా నిలువ గోరె యేసుడు. (2)
సహియింతువా తీర్పునాడు. (2)    ||ఓ సంఘమా||

చీకటిలో నుండి వెలుగునకు – లోకములో నుండి వెలుపలకు
శ్రీకర గుణాతిశయములను – ప్రకటించుటకే పిలిచెనని
గుర్తించుచుంటివా క్రియలను గంటివా. (2)
సజీవముగా నున్నావా. (2)     ||ఓ సంఘమా||

చల్లగనైన వెచ్చగను – ఉండిన నీకది మేలగును
నులివెచ్చని స్థితి నీకుండిన – బయటకు ఉమ్మి వేయబడుదువేమో
నీ మనసు మార్చుకో తొలిప్రేమ కూర్చుకో. (2)
ఆసక్తితో రక్షణ పొందుమా. (2)     ||ఓ సంఘమా||


Comments

Popular posts from this blog

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు

నీ చేతితో నన్ను పట్టుకో