ఆనంద యాత్ర ఇది ఆత్మీయ యాత్ర

“ఆనంద యాత్ర - ఇది ఆత్మీయ యాత్ర
యేసుతో నూతన - యెరుషలేము యాత్ర
మన.. యేసుతో నూతన - యెరుషలేము యాత్ర”.  ||ఆనంద యాత్ర||

1.యేసుని రక్తము - పాపములనుండి విడిపించెను (2)
వేయి నోళ్ళతో స్తుతించినను - తీర్చలేము ఆ ఋణమును (2). ||ఆనంద యాత్ర||

2.రాత్రియు పగలును - పాదములకు రాయి తగలకుండా (2)
మనకు పరిచర్య చేయుట కొరకై - దేవదూతలు మనకుండగా (2).   ||ఆనంద యాత్ర||

3.కృతజ్ఞత లేని వారు - వేలకొలదిగ కూలినను (2)
కృపా వాక్యమునకు సాక్షులమై - కృప వెంబడి కృప పొందెదము (2).  ||ఆనంద యాత్ర||

4.ఆనందం ఆనందం - యేసుని చూచే క్షణం ఆసన్నం
ఆత్మానంద భరితులమై - ఆగమనాకాంక్షతో సాగెదం.   ||ఆనంద యాత్ర||

“aananda yaatra - idi aatmeeya yaatra Yesuto nootana - yerushalemu yaatra Mana.. yesuto nootana - yerushalemu yaatra”. ||aananda yaatra|| 1.yesuni raktamu - paapamulanundi vidipinchenu (2) Veyi nollato stutinchinanu - teerchalemu aa runamunu (2). ||aananda yaatra|| 2.raatriyu pagalunu - paadamulaku raayi tagalakundaa (2) Manaku paricharya cheyuta korakai - devadootalu manakundagaa (2). ||aananda yaatra|| 3.krutajnyata leni vaaru - velakoladiga koolinanu (2) Krupaa vaakyamunaku saakshulamai - krupa vembadi krupa pondedamu (2). ||aananda yaatra|| 4.aanandam aanandam - yesuni chooche kshanam aasannam Aatmaananda bharitulamai - aagamanaakaankshato saagedan. ||aananda yaatra||

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు