నీవు చేసిన ఉపకారములకు
నీవు చేసిన ఉపకారములకు - నేనేమి చెల్లింతును. (2)
ఏడాది దూడెలనా… వేలాది పోట్టేల్లనా. (2) ||నీవు చేసిన||
1.వేలాది నదులంత విస్తార తైలము - నీకిచ్చినా చాలునా. (2)
గర్భ ఫలమైన నా జేష్ట్య పుత్రుని - కిచ్చినా చాలునా. (2) ||ఏడాది||
2.మరణపాత్రుడనైయున్న నాకై - మరణించితివ సిలువలో. (2)
కరుణ చూపి నీ జీవ మార్గాన - నడిపించుమో యేసయ్యా. (2) ||ఏడాది||
3.విరిగి నలిగిన బలి యాగముగను - హృదయ మర్పింతును. (2)
రక్షణ పాత్రను చేబూని నిత్యము - నిను వెంబడించెదను. (2) ||ఏడాది||
4.ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు - నీకేమి చెల్లింతును. (2)
కపట నటనాలు లేనట్టి హృదయాన్ని - అర్పించినా చాలునా . (2) ||ఏడాది||
Neevu chesina upakaaramulaku -
nenemi chellintunu. (2)
Edaadi doodelanaa…
velaadi pottellanaa. (2) ||neevu chesina||
1.velaadi nadulanta vistaara tailamu -
neekichchinaa chaalunaa. (2)
Garbha phalamaina naa jeshtya putruni -
kichchinaa chaalunaa. (2) ||edaadi||
2.maranapaatrudanaiyunna naakai -
maraninchitiva siluvalo. (2)
Karuna choopi nee jeeva maargaana -
nadipinchumo yesayyaa. (2) ||edaadi||
3.virigi naligina bali yaagamuganu -
hrudaya marpintunu. (2)
Rakshana paatranu chebooni nityamu -
ninu vembadinchedanu. (2) ||edaadi||
4.ee goppa rakshana naakichchinanduku -
neekemi chellintunu. (2)
Kapata natanaalu lenatti hrudayaanni -
arpinchinaa chaalunaa . (2) ||edaadi||
Comments
Post a Comment